శానిటేషన్ సిబ్బందిపై జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి..

-

GHMC employee sexually assaults sanitation staff: హైదరాబాద్‌ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. శానిటేషన్ సిబ్బందిపై జిహెచ్ఎంసి ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ మహా నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

GHMC employee sexually assaults sanitation staff

గాజులరామారం జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను హింసించాడు. పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news