ఎన్నికల ప్రీడిక్షన్ పై లెక్కలు.. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్..!

-

ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని పొలిటిషియన్ ఉండడంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు పొందారు ప్రశాంత్ కిషోర్. ప్రధానంగా 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి రావడం.. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ కావడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ఇటీవలే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని పలుమార్లు వ్యాఖ్యానించారు.

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తన అంచనా పై పలు పార్టీలు చేస్తున్న విమర్శలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “మంచి నీరు తాగడం మనస్సు, శరీరం రెండింటినీ హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఈ ఎన్నికల ఫలితాల్లో తన అంచనాలపై గగ్గోలు పెడుతున్న వారు జూన్ 04న పుష్కలంగా నీటిని అందుబాటులో ఉంచుకోండి. మే 02వ తేదీ 2021ని, పశ్చిమబెంగాల్ ను గుర్తుంచుకోండి” అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news