GHMC Vijayalaxmi Gadwal: హైదరాబాద్ ప్రజలకు కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఆదేశించడం జరిగింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/09/ghmc-mayor-gadwal-vijayalaxmi-on-rainsghmc-mayor-gadwal-vijayalaxmi-on-rains.jpg)
నాళాలు, స్టార్మ్ వాటర్ డ్రైన్ నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఆపద సమయంలో జి హెచ్ ఎం సి కంట్రోల్ రూం, o40- 21111111 గాని మై జి హెచ్ ఎం సి యాప్ కు ఆన్ లైన్ ద్వారా గాని డి అర్ ఎఫ్(హైడ్రా) 9000113667 కు సంప్రదించాలని మేయర్ కోరారు. శిధిలవస్థలో ఉన్న గృహాలు, కాంపౌండ్ వాల్స్, నిర్మాణంలో ఉన్న భావన వద్ద అవాంచనీయ సంఘటనలు జరగకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని సిసిపి మేయర్ ఆదేశించారు.