వర్షాల నేపథ్యంలో అధికారులకు జీహెచ్ఎంసీ కమిషన్ కీలక ఆదేశాలు

-

హైదరాబాద్లో వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాచుపల్లి ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. హైదరాబాద్‌లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను అదేశించారు.

టౌన్ ప్లానింగ్ సీసీపీతో సమీక్ష నిర్వహించిన రొనాల్డ్ రోస్ వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్కిళ్ల వారీగా శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు,  నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెల్లార్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు, ప్రహరీలు, సెల్లార్ల తవ్వకంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిర్మాణదారులని హెచ్చరించాలని రొనాల్డ్‌ రాస్‌ చెప్పారు. సర్కిళ్ల పరిధిలో ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు సహా శిథిలావస్థకు చేరిన నిర్మాణలపై ఈనెల 18 పూర్తి నివేదిక అందించాలని టౌన్‌ ప్లానింగ్ అధికారులను రోనాల్డ్ రాస్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news