హైదరాబాద్‌లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు

-

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ వ్యవహారం ఇప్పటికే చర్చనీయమైన విషయం తెలిసిందే. అయితే తా జాగా హైదరాబాద్‌లోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఈ గుర్తును కేటాయించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న దాసరి సాహితికి జనసేన గుర్తు గాజుగ్లాసును ఇచ్చారు.

గత ఏడాది నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించగా ఈసారి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజుగ్లాసు ఇచ్చారు.

 

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డురోలర్‌, చపాతీ రోలర్‌.. బీఆర్ఎస్ అభ్యర్థులకు స్వల్పంగా నష్టాన్ని కలిగిస్తోందని, మెజారిటీని తగ్గిస్తోందని ఆ పార్టీ అగ్ర నాయకులు భావిస్తున్నారు. ఈ అంశంపై వారు న్యాయ పోరాటం చేసినా వారి వాదనల్లో సహేతుకత లేదని ఎన్నికల సంఘ అధికారులు తేల్చి చెప్పారు. ఏడాది కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ గుర్తులను ఇతరులకు కేటాయించకుండా తాము ఆదేశించబోమని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version