దేశ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయాలని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణలో సభ్యత్వాలు నమోదు చేసి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర బీజేపీ ఆఫీస్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ భన్సాలీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ముఖ్యంగా బీజేపీ యువ, మహిళా, కిసాన్ మోర్చాలకు మెంబర్ షిప్ డ్రైవ్ పై అవగాహన కల్పించారు. నాయకులు, కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి సభ్యత్వం నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రధానంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పని చేస్తున్నదని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి జరగబోయే మెంబర్ షిప్ డ్రైవ్ కోసం క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలోని పలు విభాగాల అధిష్టానం వర్క్ షాపుల ద్వారా ఇన్ పుట్ అందజేసినట్టు తెలిపారు.