Gold Rates: ఉగాది రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు

-

Gold Rates: ఉగాది రోజు మగువలకు బిగ్‌ షాక్‌.. పండుగ పూట కూడా బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on april 9th date

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 71, 780 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 65, 810 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 84, 600 గా నమోదు అయింది. అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 80 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news