Gold Rates : గోల్డ్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.
![Gold Rates on sep 16th](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/09/Gold-Rates-on-sep-16th.jpg)
ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి, రూ. 58, 040 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 53, 200 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 తగ్గిపోయి రూ. 75, 500 గా నమోదు అయింది.