Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్. గత మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా… బంగారానికి ఉన్న డిమాండ్ ఇంకొక వస్తువుకు లేదన్న సంగతి తెలిసిందే. మన ఇండియాలో ప్రతి పండుగకు.. బంగారం కచ్చితంగా కొనుగోలు చేస్తారు. బంగారం లేనిది ఏ పండుగ జరగదు. అయితే ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తులం బంగారం ధర 70,000 దాటిపోయింది.
ఇక తాజాగా బంగారం ధరలు అలాగే వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మహానగరంలో… తగ్గిన బంగారం అలాగే వెండి ధరలు వివరాలు ప్రకారం… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి 69, 810 రూపాయలకు చేరుకుంది.అలాగే 10 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ఆ పది రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 63, 990రూపాయలుగా నమోదు అయింది. అంటే వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పడ్డాయి. కిలో వెండి ధర ₹100 తగ్గి 88, 900 నమోదు అయింది.