ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం.. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పథకం అమలు పై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో కొత్త ఆటోలకు అనుమతులు ఇస్తే.. ఉన్న ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉంటుంది. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కులగణన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని.. బీహార్ తరహాలో అమలు చేస్తామని తెలిపారు మంత్రి పొన్నం.
ముఖ్యంగా కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. బీహార్ లో 2.5లక్షల మంది అధికారులను కేటాయించి.. ఒక్కొక్కరికీ 150 ఇండ్ల చొప్పున అప్పగించారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి అధికారులను నియమిస్తామన్నారు. నోడల్ ఆఫీసర్ గా బీసీ వెల్పేర్ డిపార్టుమెంట్ ఉంటుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కు సీబీఐ నోటీసులు వాయిదాల పద్దతితో వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. అందుకే మళ్లీ కొత్త డ్రామా అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్.