మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇక టీడీపీ – జనసేనా కూటమి సీట్ల పంపకం పైన మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.తన అభిమానులకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘పవన్ సీట్ల పంపకాన్ని చూసి అభిమానులు ఏడవాలో, నవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. పవన్, బాబు తోడు దొంగలా వస్తున్నారు. కానీ సీఎం జగన్ సింహంలా సింగిల్గా వస్తున్నారు. 175కు 175 సీట్లు గెలుస్తాం. ప్రజలకు మా పాలన నచ్చకపోతే మమ్మల్ని ఓడిస్తారు. మీరు ఎందుకు పొత్తులు పెట్టుకోవడం?’ అని ఆయన ప్రశ్నించారు.