నగర వాసులకు ఎంఎంటీఎస్ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసులు రెండు రోజుల పాటు రాత్రిళ్లు కూడా పనిచేయనున్నాయి.హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిమజ్జనం నేపథ్యంలో 2 రోజుల పాటు 24 గంటలు నిరంతరంగా ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
దూర ప్రాంతాల నుంచి నిమజ్జనం చేసేందుకు, చూసేందుకు ప్రజలు తరలివస్తుండటంతో ఈ మేరకు ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. 17వ తేదీన రాత్రి 11.10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి, అదే రోజు రాత్రి 11.50 నిమిషాలకు సికింద్రాబాద్ టు హైదరాబాద్, 18న అర్థరాత్రి 12.10కి లింగంపల్లి టు ఫలక్‌నుమా, 18న రాత్రి 12.30కి హైదరాబాద్ టు లింగంపల్లి, 18న ఉదయం 1.50కి లింగంపల్లి టు హైదరాబాద్,18న రాత్రి 2:20కి ఫలక్‌నుమా టు సికింద్రాబాద్, 18న రాత్రి 3:30కి హైదరాబాద్ టు సికింద్రాబాద్, 18న ఉదయం 4:00 గంటలకు సికింద్రాబాద్ టు హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ సర్వీసులు సేవలు అందించనున్నాయి.