Implementation of section 144 in Hyderabad: హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు ఉందని పోలీసులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతల అరెస్ట్ పై DCP కోటి రెడ్డి మాట్లడుతూ… 144 సెక్షన్ అమలులో ఉందని… Mlc రాజు నీ హౌజ్ అరెస్టు చేశామన్నారు. ర్యాలీలకు అనుమతులు లేవని వివరించారు.
ఇంకో వైపు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయని… Mla కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేసినట్లు వివరించారు. సాయంత్రం వరకు హౌజ్ అరెస్టు చేస్తామని తెలిపారు. పరిస్థితిని బట్టి విడుదల చేస్తామని ప్రకటించారు DCP కోటి రెడ్డి.
అటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు బయలుదేరారు. ఈ తరుణంలోనే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇద్దరి చుట్టుముట్టారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని, శంబిపూర్ రాజును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని లోపలికి పంపించి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.