రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తరువాత రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని.. సంక్రాంతి పండుగ తరువాత పథకం నిధులు రైతుల అకౌంట్ లో జమ చేస్తామని ప్రకటించారు. విధి, విధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పై చర్చిస్తామని తెలిపారు.

CM Revanth Reddy

మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుంది. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశామని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇచ్చి చూపించాం. అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ లు మారీచుల రూపంలో వస్తారు. ఎవ్వరూ ఆందోళన చెందకూడదన్నారు. రాబోయే రోజుల్లో సన్నాలకు కూడా బోనస్ లు ఇస్తామని తెలిపారు. రైతులు నాణ్యమైన సన్నాలు పండిస్తే.. వాటిని పేదలకే అందజేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news