తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు.మార్క్ ఫెడ్ ద్వారా అన్ని రకాల పంటల కొనుగోలు సజావుగా సాగేందుకు ఆదేశాలు (మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, జొన్న) ఇచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పంటల భీమా -2024 అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో, ఈ ఖరీఫ్ కాలానికి పంటల భీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టవల్సిందిగా ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశానుసారం ఏ ఒక్కరైతు, ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయో సందర్భము ఇక ఉండకుండా ఈ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియచేశారు.అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో సంబంధిత అధికారులు సంస్థలతో చర్చించి రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని అప్పటివరకు ఆర్థిక రంగ సంస్థలు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రైతులను పంటరుణాల రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని వారిని కోరారు.