తెలంగాణ రాష్ట్ర రైతులకు రిలీఫ్.. రైతు భరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వం… పంటరుణాలు రికవరీ కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు, బ్యాంకులకు వినతి ఇచ్చింది. వచ్చే వానాకాలనికి సంబంధించి ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు చేశారు మంత్రి తుమ్మల.
మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేవిధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు, అదేవిధంగా పండ్ల పక్వానికి కార్బైడ్ ప్రయోగించే వ్యాపారస్తులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్యము ప్రకటించిన రైతుభరోసా పథకాన్ని అమలు చేసే విధివిధానాల మీద కసరత్తు జరుగుతుందని, వచ్చే ఖరీఫ్ నుండి దీనిని అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరికీ అమోదయోగ్యమైన విధానాన్ని రూపోందించి, అర్హులైన వారందరికీ రైతుభరోసా అందజేస్తామని తెలియచేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.