Good news for Telangana ration card holders: తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేషన్ కార్డులు ఉన్నవారికి… రాయితీపైన గోధుమలను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ మహానగరంలో మాత్రమే గోధుమలను డిస్కౌంట్ ధరలో రేషన్ కార్డుదారులకు అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

అయితే ఇకపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… హైదరాబాద్ మాదిరిగానే పంపిణీ చేయాలని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పైన కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. సిలిండర్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 48 గంటల సమయంలోనే వారి డబ్బులను అకౌంట్లో వేయాలని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.