తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగాల ప్రకటన చేయగానే.. రాష్ట్రంలో.. నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరిక్షించుకునేందుకు సిద్దమౌవుతున్నారు. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో.. ప్రిపరేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం టీశాట్ ప్రత్యేకంగా డిజిటల్ శిక్షణ అందించేందుకు సిద్దమైంది.
ప్రస్తుతం టెట్ దరఖాస్తులు స్వీకరిస్తోన్న నేపథ్యంలో.. ఆ అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 4 అంటే నేటి నుంచే జూన్ 5 వ తేదీ వరకు 60 రోజుల పాటు టీశాట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ ఏకంగా 102 ఎపిసోడ్ల ద్వారా ఇవ్వనున్నారు. ఉదయం, మధ్యాహ్నాల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల పాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. ఇక శిక్షణ ప్రారంభం చేసే కంటే.. ముందు వారం పాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అభ్యర్థులకు మంచి అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని కచ్చితంగా అందరూ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని కోరింది సర్కార్.