యాదాద్రి భక్తులకు అలర్ట్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించేందుకు సమయాత్తం అవుతుంది. కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో అధ్యయనం చేయించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వద్దకు ప్రతిపాదనలు అందాయి.
త్వరలో మంత్రి ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాసవానికి యాదగిరి కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ మినీ బస్సులతో పాటు వ్యక్తిగత వాహనాలను అనుమతిస్తున్నారు. 500 రూపాయలు చెల్లిస్తే వ్యక్తిగత వాహనాలను పైకి వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రస్తుతం సగటున రోజుకు 500 నుంచి 600 వ్యక్తిగత వాహనాలు కొండపైకి వెళ్తున్నాయి. రానున్న రోజులలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కాలుష్యం పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే పైకి పంపించేందుకు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.