నిరుద్యోగులకు గుడ్ న్యూస్..తెలంగాణాలో కొలువుల జాతర..

-

తెలంగాణ లోని విద్యార్థులకు, నిరుద్యొగులకు చక్కటి శుభవార్త..ఇప్పటికే పలు శాఖలలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 26వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అభ్యర్థులు ఆ రోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఈ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు..అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 21 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండాలి.

మొత్తం పోస్టుల ఖాళీలు: 225

జోన్ ఖాళీలు

Zone – I – Kaleshwaram 20

Zone – II – Basara 21

Zone – III – Rajanna 31

Zone – IV – Bhadradri 31

Zone – V – Yadadri 31

Zone – VI – Charminar 70

Zone – VII – Jogulamba 21

నోటిఫికేషన్ జారీ చేసిన తేదీకి రెండేళ్లు లేదా అంతకంటే ముందు హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ www.tslprb.in వెబ్ సైట్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోనే ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news