ముంపు గ్రామాల బాధితులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల

-

నియోజకవర్గంలోని ముంపు గ్రామాలకు ఉత్తంకుమార్ రెడ్డి తీపి కబురు చెప్పారు. జూరాల బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైన అనుగొండ ఆర్ఆర్ సెంటర్లో ప్లాట్ల ఏర్పాట్లు చేసిన ఆర్ఆర్ సెంటర్ అంతర్గత డ్రైనేజీలు రోడ్లు వీధి దీపాలు పార్క్.ఆటస్థలం. పాఠశాల. కమ్యూనిటీ హాల్ పనులు మౌలిక వసతుల ఏర్పాటు కోసం మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి 42 కోట్ల 11 లక్షల విడదల చేసినట్టు ముంపు గ్రామాల అధ్యక్షులు తెలిపారు. ముంపు గ్రామాల పరిస్థితులపై అక్కడ కల్పించాల్సిన వసతులపై అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఓ కమిటీని వేసి వారితో ఓ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పాడని వారు తెలిపారు.

సోమవారం మక్తల్ ఎఎంసి కార్యాలయంలో జూరాల సంగం మండలం భూత్పూర్ రిజర్వాయర్లు ముంపుకు గురైన 13 గ్రామాల నిర్వాసితుల అధ్యక్షులు ముఖ్య నాయకులతో జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. గత 40 సం.ల క్రితం నిర్మించిన జూరాల ప్రాజెక్టు వలన రెండు జిల్లా తాగు, సాగునీటి అవసరాలకోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మంచిన 2007 లో జిఓ 1050 ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా లోఉప్ఫెర్, నాగర్ దొడ్డి, గార్లపాడుతో పాటుమక్తల్ నియోజక వర్గంలోని అనుగొండ, అంకెన్ పల్లి, దా దన్ పల్లి గ్రామాలు పునరావాస గ్రామాలుగా ప్రకటించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news