తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు చేర్చడంతోపాటు 1375 పాత చికిత్సలకు నగదు ప్యాకేజీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నెముక సంబంధించి తదితర చికిత్సలను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చినట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన రూ.497.29 కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి కీలక ప్రకటన చేశారు.
ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు కత్తెర పడబోతుంది. పాత పెన్షన్ల కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్లు ఎగిరిపోవడం ఖాయం అని తేల్చారు మంత్రి పొంగులేటి. ఇక మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవ్వా తాతల గుండెల్లో ఆందోళన నెలకొంది. పెన్షన్లకు పైరవీలు అంటూ వ్యాఖ్యలు జోడించిన మంత్రి పొంగులేటి… ఖమ్మం ప్రజలకే కాదు ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్తింపు అంటూ హెచ్చరికలు ఇచ్చారు. పెన్షన్ల జారీలో పైరవీలు ఎలా సాధ్యం?? అర్హత లేకుంటే పెన్షన్లు ఎలా సాధ్యం? అంటూ పొంగులేటి పై పెన్షనర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పెన్షన్ల కోతలు తప్పవు అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో రేవంత్ సర్కార్ పడింది.