తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జేఎన్టీయూ. ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్యుయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్టీయూ యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించగా కనీసం 30 శాతం విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలి అని తెలిపింది.
ఇంజనీరింగ్ 2, 3,4 వ ఏడాది విద్యార్థులు బీబీఏ చేసుకోవచ్చు. ఏటా 60,000 చొప్పున మూడేళ్లలో లక్ష 80 వేలు ఫీజు కట్టాల్సి ఉంటుందని తెలిపింది. కనీసం మూడేళ్లు మరియు గరిష్టంగా ఆరేళ్లు కోర్స్ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే శని మరియు ఆదివారాల్లో ప్రత్యక్ష క్లాసులు మిగతా వారాలలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.