హైడ్రా నోటీసులు.. కోర్టును ఆశ్రయించిన గోపాల్ సొసైటీ..!

-

తమ సొసైటీ లో 40 ఇళ్లకు నోటీసులు వచ్చినట్లు గోపాల్ అమర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ తెలిపారు. ఈ విషయంలో మేము సంబంధిత అధికారులను కలిసాము. కొంతమంది ఇండివిజువల్ గా కోర్టు కి వెళ్లారు. రెవెన్యూ విభాగాన్ని కలవబోతున్నం. 2002 లో వాల్టా యాక్ట్ వచ్చింది. మేము ఆ చట్టం కిందకు రాము. ప్రభుత్వం మారిన ప్రతిసారి మాకు నోటీసులు మారుతున్నాయి. టాక్స్ కడుతున్నాము.. రిజిస్ట్రేషన్ చేయడానికి 7లక్షలు కట్టాము. అప్పుడు ఎందుకు మేము FTL కిందకు రాలేదు.

ఇక్కడ ఉన్నవాళ్ళం అంతా మధ్యతరగతి కుటుంబాలు. 2015 లో తిరుపతి రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకుంటే… ఎలా చేసింది అని ప్రశ్నించారు. ఇక న్యాయవ్యవస్థ పైనా మాకు నమ్మకం ఉంది. దాదాపుగా 25 ఏళ్ల చరిత్ర వాళ్లకు ఆధారాలుగా ఇస్తున్నాం. మా పట్టా పత్రాలతో సహా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాం. శాఖల మధ్య సమన్వయం లేక ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటారని అనుకుంటున్నాం. అన్ని ఆధారాలతో మేము కోర్టు ను ఆశ్రయించాము అని గోపాల్ సొసైటీ సెక్రెటరీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version