పొలిటికల్ స్క్రీన్ మీదకు నందమూరి సుహాసిని.. కీలక పదవి ఇస్తారంటూ లీకులు..

-

తనకు ఇబ్బంది కల్గుతున్న చోట.. తనను ఇబ్బంది పెడుతున్న వారికి ప్రత్యామ్యాయంగా వేరే వారిని తెరమీదకు తీసుకురావంలో చంద్రబాబు సిద్దహస్తుడు.. నందమూరి బ్రాండ్ కోసం బాలయ్యబాబును దగ్గరకుతీసుకున్న చంద్రబాబునాయుడు ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు.. తాజాగా నందమూరి సుహాసినిని తెరమీదకు తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది..

వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు..ఖాళీ ఏర్పడిన వాటిల్లో ఒక స్థానాన్ని నందమూరి సుహాసినికి ఇస్తారనే టాక్ ను టీడీపీలో వినిపిస్తోంది.. ఈ రెండు స్థానాలపై టిడిపి సీనియర్ నేతలు చాలామంది ఆశలు పెట్టుకోగా చంద్రబాబు మాత్రం ఈ రెండు స్థానాల్లో ఒకటి నందమూరి కుటుంబానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట.

జూనియర్ ఎన్టీయార్ కు చెక్ పెట్టేందుకే సుహాసిని తెరమీదకు తీసుకొచ్చారనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి.. గతంలో చంద్రబాబును ఎన్టీయార్ ఇబ్బంది పెట్టారనే.. దీంతో ఆయనకు సుహాసిని ద్వారా చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది..ప్రస్తుతం టిడిపి నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న నేతలు చాలామంది ఉన్నారు. గల్లా జయదేవ్ తో పాటు..మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర , పనబాక లక్ష్మి, తదితరులుండగా.. సుహాసిని ఇస్తే నందమూరి వంశానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందని చంద్రబాబు ఆలోచనగా తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.. ఇది చంద్రబాబు ఆలోచనో లేక.. పొలిటికల్ స్టాటజీనో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version