అప్పా చెరువు కూల్చివేతలపై హైడ్రా స్టేట్మెంట్..!

-

గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం శనివారం ఉదయం కూల్చి వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హైడ్రా స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఇక వాటి పైన స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు.

అనంతరం హైడ్రా అధికారులు అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా పదమూడు షెడ్లను నిర్మించినట్లుగా నివేదిక ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం స్థానిక పోలీసులు, రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో అప్పా చెరువులో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్ల నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ తొలగింపులతో లతో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల చెరువును భూమిని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకొనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version