పోడు భూముల రైతులకు ప్రభుత్వం శుభవార్త

-

కొన్ని దశాబ్దాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడు భూముల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 30న పోడు భూములకు పట్టాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి సీఎం కేసీఆర్ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా పట్టాలు పంపిణీ చేయాలని మంత్రులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పైగా 1.55 లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఇందుకు సంబంధించి పట్టాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. ఇక నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న లబ్ధిదారులకు సైతం.. రాష్ట్రంలోని మిగతా రైతులకు అందిస్తున్న మాదిరిగానే రైతు బంధు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై పోడు భూముల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news