వేత‌నాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యూట‌ర్న్

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పాల‌క వ‌ర్గం వేతనాల‌ను పెంచుతున్నాట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్ర వారం నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ నిర్ణ‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమ‌లు లో ఉంది. ఈ ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌భుత్వం ఇలాంటి జీవో లు విడుద‌ల చేయరాదు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. అయితే శుక్ర వారం రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న మున్సిపాలిటీ పాల‌క వ‌ర్గానికి వేత‌నాలు పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

అంతే కాకుండా దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా జారీ చేసింది. దీని ప్ర‌కారం అంద‌రికీ 30 శాతం వేత‌నాలు పెరిగే అవ‌కాశం ఉండేది. మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు, వార్దు స‌భ్య‌ల గౌర‌వ వేత‌నం పెరిగేది. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌లు లో ఉండ‌టం వ‌ల్ల ఈ ఉత్త‌ర్వుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news