గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక : డిప్యూటీ సీఎం భట్టి

-

గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. TGREDCO అధికారులు రూపొందించిన విద్యుత్ పొదుపు క్యాలెండర్-2025ను శుక్రవారం ప్రజాపాలన భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా.. తెలంగాణలో విద్యుత్ పొదుపు వేడుకలు జరుగనున్నట్టు చెప్పారు.

2035 నాటికి 40 గిగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని తెలిపారు. విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్థత సాధనకు అన్ని రంగాలలో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సంరక్షణ మీద విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోనే మొదటి స్థానంలో పొదుపు అవార్డులు తెలంగాణ అందుకుందని వెల్లడించారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news