తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారం మెను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మండలానికి ఒక పాఠశాలలో సీఎం అల్ఫాహార స్కీమ్ ప్రారంభం కానుంది. రేపు మహేశ్వరం నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అల్పాహార స్కీమ్ ను ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాలకు ముందుగా ఉదయం వేళలో అల్పహారం అందించనున్నారు.
మెను ప్రకారం.. ప్రతీ సోమవారం ఇడ్లీ, సాంబార్ లేదా గోదుమ రవ్వ ఉప్మా, ఛట్నీ. మంగళవారం పూరీ, ఆలు కుర్మ లేదా టొమాటో బాత్ తో పాటు రవ్వ సాంబార్. బుధవారం ఉప్మా-సాంబార్, లేదా రైస్ రవ్వ కిచిడి+చట్నీ. గురువారం ఏదైనా మిల్లెట్ ఇడ్లీ+సాంబార్ లేదా పొంగల్ సాంబార్. శుక్రవారం రోజు ఉగ్గాని, పొహా, లేదా ఇడ్లీ+చట్నీ లేదా గోదుమ రవ్వ కిచిడి+చట్నీ. శనివారం పొంగల్ సాంబార్ లేదా వెజిటేబుల్ పొలావు+ రైతా/ ఆలు కుర్మ అల్పాహారంలో అందించనున్నారు. అక్టోబర్ 06 నుంచి ఈ స్కీమ్ ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.