రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

-

రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.   రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రుణమాఫీ ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా.. లేదా.. ఎంత ఇస్తామన్నారు ఎంత ఇచ్చారు అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులకు స్పష్టత లేదు.  రైతులకు మోసం పూర్తిగా జరిగింది. మాఫీ 20 లేదా 30 శాతం జరిగితే 100% టోకరా జరిగింది. రుణమాఫీపై ముఖ్యమంత్రిది, మంత్రులది తలో మాట అన్నారు. మాటల గారడితో రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.  రైతుల పక్షాన ఒకటే డిమాండ్ పెడుతున్నాం. ఏ ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిసెంబర్ 9 అన్నారు.. ఆగస్టు 15 అన్నారు 2 తేదీల్లో పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదని రేపు ధర్నాకు పిలుపునిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో రైతులు ధర్నా చేస్తారని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version