సిద్దిపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కులం పేరిట మానవత్వం మంట గలిసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అక్బర్ పేట్ భూంపల్లి మండలం బొప్పాపూర్ కు చెందిన బండ మీది సాయిలు మృతి చెందారు. ఈ తరుణంలోనే…. భూ తగాదా ఇష్యూ చూపించి…శవంపై కుల బహిష్కరణ వేశారు. మృతుడు బండ మీది సాయిలు ఇంటికి వెళ్లినా, వారితో మాట్లాడినా రూ.500 జరిమాన వేస్తామని కుల పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు.
పలు మార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుల బహిష్కరణ పేరిట మమ్ముల్ని వేధిస్తున్నారని మృతుని కుటుంబ సభ్యులు అంటున్నారు. మాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరుతున్నారు మృతుని కుటుంబ సభ్యులు.