గ్రూప్-1 పై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

-

గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల నిర్వహించడం పై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఓవైపు జీవో నెం. 29 రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తెలుగు అకాడమీ బుక్స్ నుంచి కాకుండా వీకీపీడియా నుంచి పరిగణలోకి తోసుకోవడం, చదువుకునేందుకు కొంత సమయం కావాలని అందుకే ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలని గ్రూపు-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేపడుతున్న అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్, సచివాలయం ప్రాంగణాలు మొత్తం నిన్న ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని చోట్ల లాఠీ ఛార్జీ కూడా జరిగింది. 

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి గ్రూపు 1 పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. గ్రూపు-1 పరీక్ష కోసం ఎన్నో ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న వారు ఉన్నారు. దయచేసి అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. తరచూ వాయిదాలు వేస్తే.. నిరుద్యోగులకే నష్టం జరుగుతుందని సీఎం తెలిపారు. మరోవైపు గ్రూపు-1 అభ్యర్థుల డిమాండ్ల పై రాష్ట్ర మంత్రులు చర్చిస్తున్నారు. గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల, జీవో నెం.29 తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో శనిరం రాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news