ప్రోటోకాల్ వివాదంపై గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు !

-

గత కొన్నిరోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య ప్రోటోకాల్‌ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన గవర్నర్ తమిళ సై…. ప్రొటోకాల్ వివాదం పై మాట్లాడటానికి ఇష్టపడలేదు. వివాదం ఏమి లేదని నవ్వుతు సమాధానం చెప్పారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంటరీ సంతోషాన్ని కలిగించిందని.. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారని పేర్కొన్నారు.

భద్రాచలం దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమం కు రావడం సంతోషంగా ఉందని.. గతంలో గర్భిణులు కు పౌష్టికాహారం మరియు వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందనివెల్లడించారు. చాలా గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీ మహిళలు పౌష్టికాహారం లోపంతో వుండడం గమనించామని… చాలా మంది గర్భిణీ స్త్రీలు వారి యొక్క బిపి కూడా చాలా ఎక్కువగా ఉండడం గమనించామనిపేర్కొన్నారు.

దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్ళు తినడం వల్లే జరిగింది అని గమనించాం..చాలా మంది పౌష్టికాహారం లోపం మరియు అనిమియా తో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వారందరికీ మెడికల్ క్యాంపు లు పెట్టి వారికి వెరీ హైజన్ ఉండే కిట్ లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముందు ముందు కూడా ఎక్కువగా గిరిజనుల సమస్యలపై రాజ్ భవన్ నుంచి దృష్టి పెట్టడం జరిగిందని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version