భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం

-

జనవరి 25నుంచి భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. హైదరాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్న భార‌త్‌-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌ రాజ‌న్‌కు ఆహ్వానం అందింది. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు గవర్నర్ను ఈ మ్యాచ్కు ఆహ్వానించారు.

రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్ కలిసిన జ‌గ‌న్‌ మోహ‌న్‌ రావు ఆమెకు ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా హెచ్‌సీఏ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌ను త‌మిళిసైకి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ప‌రిచ‌యం చేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాల‌ను మ్యాచ్‌కు ఉచితంగా అనుమ‌తించ‌డం, ఇత‌ర‌త్ర ఏర్పాట్లు గురించి వివ‌రించారు.

మరోవైపు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టు భారత్కు చేరుకుంది. హైదరాబాద్ చేరుకున్న ఈ జట్టుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. మరోవైపు ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు, 15వ తేదీ నుంచి రాజు కోర్టులో మూడో టెస్టు, 23 నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7 నుంచి ధర్మశాలలో ఐదో టెస్టు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version