నిజాం కాలేజీలో అయోధ్య ప్రాణప్రతిష్ఠ లైవ్ స్ట్రీమింగ్

-

అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పలుచోట్ల లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ తరుపున హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో ప్రారంభ ఉత్సవాల వేడుకలను లైవ్ చూసేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణాన్ని అరటి ఆకులు, పువ్వులతో అందంగా అలంకరించారు. డప్పుచప్పుళ్లు, సీతారాముల వేషధారణలతో, అర్చకుల మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కుటుంబ సమేతంగా సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొద్ది క్షణాల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభమై 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష నేరవెరబోతుందని అన్నారు. రామ మందిరం ప్రారంభం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. అయోధ్యలో అందరూ ప్రత్యక్షంగా పాల్గొనలేరు కాబట్టే వీక్షించేందుకు ఎక్కడికక్కడ భారీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version