తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై – రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా పెండింగ్ బిల్లుల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్. వెనక్కి పంపిన బిల్లుల గురించి ఆమె మాట్లాడుతూ.. తాను ఎవ్వరికీ వ్యతిరేకం కాదని అన్నారు. వెనక్కి పంపడంపై నా అభ్యంతరాలను స్పష్టంగా తెలిపారని అన్నారు.
వెనక్కి పంపిన బిల్లులపై వివరాలు కావాలని స్పీకర్ ని అడిగానని.. మూడు బిల్లులకు తాను ఆమోదం తెలిపానని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడడం ఎంతో బాధ కలిగించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు అండగా ఉండాలన్నారు. వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని.. రాగానే కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు వెల్లడించారు. ఇక త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తానని తెలిపారు.