పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం విపక్షాల నోరు నొక్కేస్తోందని ఆరోపించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని వేరే వేరే అంశాలపై చర్చిస్తున్నారు కానీ మా ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం లేదన్నారు. మణిపూర్ సమస్యపై స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరని.. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సిద్ధంగా లేవనేలా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ చర్చల కోసం ప్రతిపక్షాలు 11 రోజులుగా ఎదురు చూస్తున్నాయని తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలను మాట్లాడడం ఇవ్వడం లేదన్నారు. తన మైక్ స్విచ్ ఆఫ్ చేయడం తనకు అవమానకరంగా అనిపించిందన్నారు. ప్రతిపక్షం మణిపూర్ పై చర్చకు సిద్ధంగా ఉందని.. అందుకే ఇప్పటివరకు 65 మంది 267 కింద చర్చకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాను ఒక్కడినే ఇప్పటివరకు 267 కింద 7 సార్లు నోటీసులు ఇచ్చానని ఖర్గే తెలిపారు.