ఉస్మానియా ఆస్పత్రి దుస్థితిపై గవర్నర్ తమిళిసై ట్వీట్

-

శతాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ చూస్తే ఆందోళన కలుగుతోందంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన గతంలో సర్కారు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో  చేసిన ఓ పోస్టును గవర్నర్ రీ పోస్టు చేశారు.

జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పోస్టులో ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోతో పాటు.. కొత్త భవన నిర్మాణానికి సంబంధించి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన  లేఖకు సంబంధించిన ఫోటోలు ఉండటం గమనార్హం. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని గవర్నర్ తెలిపారు. ఈ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గవర్నర్ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version