తెలంగాణ రైతులకు షాక్…5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11.30 కి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుంది. సబ్ కమిటీ చైర్మన్ గా భట్టి విక్రమార్క ,సభ్యులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనుంది సబ్ కమిటీ.
ఇక అటు 5 ఎకరాల వరకు ఉన్న రైతులు 83 శాతంగా ఉన్నారని లెక్కల్లో తేలింది. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు 97 శాతంగా ఉన్నారట. అయితే…. రైతు సంఘాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇవ్వాలని ప్రభుత్వనికి వినతులు వచ్చినట్లు సమాచారం. 5 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులపై దృష్టి పెట్టిందట ప్రభుత్వం. కౌలు రైతులు గుర్తించడం పై సబ్ కమిటీ లో చర్చ జరుగుతోందట. రైతు భరోసాకి ఎంత నిధులు అవసరమన్న దానిపై సబ్ కమిటి దృష్టి పెట్టనుందని సమాచారం.