ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్.. పోలీసులకు ప్రభాకర్ రావు షాక్

-

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్‌ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు.ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు విదేశాల్లో ఉండటంతో ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడంలేదు.

ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగొస్తేనే ఈ కేసు ముందుకు సాగుతుంది. కేసు నమోదవడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిపోవడంతో ఇది ఎటూ కదలడం లేదు. అయితే… తాను పారిపోలేదని, జూన్‌ 26నాటికి తిరిగొచ్చి, దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయించిన ఆయన. గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు… ఆయనపై బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటర్‌పోల్‌ విభాగానికి లేఖ రాయాలని సీఐడీ ద్వారా స్థానిక పోలీసులు సీబీఐని కోరగా.. ఆ విన్నపం ఇంకా సీబీఐ వద్దే పెండింగ్‌లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news