రేవంత్ సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది. దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయనుంది. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలకు సిద్ధమవుతోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్.
ఆధునిక పద్ధతిలో భూ రికార్డులను మొదలుపెట్టి దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసే విచారణలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. జియో ట్యాగింగ్, ఫెన్సింగ్, ధరణి భూమి రికార్డుల్లో నమోదు చేయనుంది రేవంత్ ప్రభుత్వం.
ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీసి తదుపరి చర్యల ప్రణాళికలతో ముందుకు పోనున్న ప్రభుత్వం…..ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆన్లైన్ డొనేషన్లు, సేవా కార్యక్రమాలు, టికెట్లు పొందేందుకు ప్రత్యేక పోర్టల్ పై చర్చ చేస్తోంది.