BREAKING: నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల కానున్నారని సమాచారం. ఈ తరుణంలోనే… 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు గ్రాండ్ వెల్కమ్ చెప్పానున్నారట. సుప్రీం కోర్టులో నేడు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళ గా, రాజకీయ నేత, ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపు వాదనలు రానున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పైజస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారణ జరపనుంది. మరి దీనిపై ఈడీ, సీబీఐ ఎలా ముందుకు వెళతాయో చూడాలి.