తెలంగాణలో తొలిరోజు ముగిసిన గ్రూపు-1 పరీక్ష

-

తెలంగాణలో ఎట్టకేలకు గ్రూపు-1 పరీక్ష మొదటి రోజు ముగిసింది. పరీక్ష జరగడానికి కంటే ముందు అభ్యర్థులు కాస్త తర్జన భర్జనలో ఉన్నారు. జీవో నెం.29ని రద్దు చేయాలని.. గ్రూపు-1మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు హైకోర్టులో కేసు నడుస్తుండగానే సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

మరోవైపు వాయిదా వేసేది లేదని.. సీఎం, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 2.00 గంటలకు 46 సెంటర్లలో గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. దీంతో అభ్యర్థులు కాస్త సంతోషంగానే బయటికి వచ్చారు. కొందరూ మాత్రం మంచిగా రాయలేదని మీడియాకు చెప్పారు. ఇంకా శనివారం వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు పోయే ముందట సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్  చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news