అక్టోబర్‌ లేదా నవంబర్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌

-

గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో టీఎస్పీఎస్సీ కాస్త ఊపిరిపీల్చుకుంది. ఎన్నో ఆరోపణలు.. విమర్శల మధ్య ఎట్టకేలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష పూర్తయింది. అయితే ఇప్పుడు కమిషన్ ఫోకస్ అంతా ప్రిలిమ్స్ మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్‌సైట్లో పొందుపరిచడంపైనే ఉంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసి.. తుది కీ విడుదల, అనంతరం మూల్యాంకనం నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది.

నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తయితే కనీసం మూడు నెలల సమయమిచ్చి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ప్రస్తుతం సెప్టెంబరు నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలతో షెడ్యూలు బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరులో గ్రూపు-1 మెయిన్స్‌ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు.. రద్దయిన గత పరీక్షతో పోల్చితే దాదాపు 50 వేల మంది వరకు తగ్గారు. వీరిలో పలువురు అభ్యర్థులు గ్రూప్‌-2, 4 పరీక్షల సన్నద్ధతపై దృష్టిపెట్టినందున ఈ పరీక్షకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news