BIG ALERT : రేపు గ్రూప్-4 పరీక్ష.. ఆ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

-

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్.. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి రేపు పరీక్ష జరగనుంది. 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 2,846 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో ఈ సెంటర్లున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. వాటికి రెండో శనివారం వర్కింగ్ డే ఉంటుందని తెలిపింది.

ఇది ఇలా ఉండగా, సీఎం కేసీఆర్ నేడు పోడు భూముల పట్టాల పంపిణీ ప్రారంభించనున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 28 జిల్లాల్లోని 4.06 లక్షల ఎకరాల భూమిపై 1.51 లక్షల మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. ఈ భూములకు ఈ వానాకాలం నుంచే రైతుబంధు ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news