తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కరెంట్ చార్జీలు పెరుగుదల లేనట్లేనని తెలుస్తోంది. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత రిటైల్ టారిఫ్ ను యధావిధిగా, కొనసాగించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఐదేళ్ల విరామం తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచగా, వచ్చేయడానికి ఎన్నికలు జరగాల్సి ఉండటంతో చార్జీలు పెంచకూడదని డిస్కాం లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తమకు సబ్సిడీలు పెంచి ఆదాయ లోటును భర్తీ చేయాలని డిస్కం లు ప్రతిపాదించనున్నాయి.