ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుస అరెస్టులు చేస్తూ ఈ స్కామ్లో కూపీ లాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల కవితకు గతంలో సిబీఐ నోటీస్ ఇచ్చింది ఇప్పుడు ఈ డి నోటీసు వచ్చిందన్నారు. అరెస్టు కూడా చేయొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. వీటన్నిటి వెనకాల రాజకీయ కుట్ర దాగుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.