హైదరాబాద్‌ కాటేదాన్‌ లో కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ ముఠా గుట్టు రట్టు

-

హైదరాబాద్‌ కాటేదాన్‌ లో కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ ఐస్ క్రీముల తయారీ చేస్తోంది ఈ ముఠా. ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్ లో విక్రయిస్తున్నారను. కల్తీ ఐస్ క్రీములు విక్రయిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు కంత్రిగాళ్లు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమ చలామణి చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రీడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండా దర్జాగా పరిశ్రమ నిర్వహణ చేస్తున్నారు. ఇక ఈ సంఘటనలో ఒకరి అరెస్ట్…..నిందితుడిని మైలార్ దేవిపల్లి పోలీసులకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాలు టార్గెట్ చేసి యమ క్రీములను విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలకు రోగాలు వస్తున్నాయి. కల్తీ పరిశ్రమల పై కన్నెతి చూడటం లేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు. అయితే, తాజాగా ఈ కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news