BREAKING : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం మల్కపేట జలాశయం రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్ అయింది.. ఆదివారం వేకువ జామున ఉదయం 12.40 గంటల నుంచి 01.40 గంటల వరకు సాగింది ట్రయల్ రన్. గంటపాటు నిరంతరాయంగా సాగింది ఈ ట్రయల్ రన్. ఈ ఘట్టాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ప్యాకేజీ – 9 EE గంగం శ్రీనివాస్ రెడ్డి.. ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్.
రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్ పట్ల మంత్రి కేటీఆర్ , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 9 లో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయంను త్వరలో సిఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవలే మే 23 న మొదటి పంపు ట్రయల్ రన్ ను విజయవంతం కాగా ఆదివారం వేకువ జామున రెండో పంపు విజయవంతం చేశారు. దీంతో మల్కపేట జలాశయం రెండు పంపుల ట్రయల్ రన్ విజయవంతం అయి ప్రారంభానికి సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం మల్కపేట జలాశయం రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్..
– ఆదివారం వేకువ జామున ఉదయం 12.40 గంటల నుంచి 01.40 గంటల వరకు సాగిన ట్రయల్ రన్
– గంటపాటు నిరంతరాయంగా సాగిన ట్రయల్ రన్
– దగ్గరుండి పర్యవేక్షించిన ప్యాకేజీ – 9 EE గంగం శ్రీనివాస్ రెడ్డి..… pic.twitter.com/5M7PLTIpTE
— Thirupathi Bandari (@BTR_KTR) June 18, 2023